ఉంమ్ సలాల్ లో వార్షిక తేనె ఉత్సవాలు
- January 08, 2016
వార్షిక తేనె ఉత్సవాలను పర్యావరణ మంత్రిత్వ శాఖ గురువారం ఘనంగా ప్రారంభించారు. ఉంమ్ సలాల్ లోని అల్ మశ్రొరిఅహ్ శీతాకాల మార్కెట్ వద్ద ప్రారంభమైన తేనె పండుగకు ప్రజాదరణ విశేషంగా ఉంది, 2003 లో మొదలైన జాతీయ తేనె , తేనెటీగల పధకం రైతులకు ఆర్ధిక, సాంకేతిక సాయం అందచేయడం విశేషం. జాతీయ తేనె ఉత్పత్తిని ప్రోత్సాహించడానికి ఈ తేనె ఉత్సవాలని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. స్థానికంగా రెండురోజులపాటు జరిగే ఈ ఉత్సవం అల్ మశ్రొరిఅహ్ శీతాకాల మార్కెట్ తర్వాత , జనవరి 14,15 వ తేదీలలో ' అల్ వక్రైహ్ ' లోనూ అలాగే , జనవరి 21, 22 వ తేదీలలో ' అల్ ఖోర్ - దఖిరే ' శీతాకాల మార్కెట్ వద్ద జరగనున్నట్లు నిర్వాహకులు తెలియచేస్తున్నారు. స్థానికంగా లభించే ఈ తేనె పరిమిత పరిమాణంలో ఈ మార్కెట్లలో దొరకనుంది. అధికారిక గణాంకాల ప్రకారం వార్షిక తేనె ఉత్పత్తి 16 టన్నులుగా నమోదు కాబడింది. మరో నాలుగేళ్ళలో రెట్టింపు ఉత్త్పత్తిని సాధించే లక్ష్యానికి చేరుకోనున్నారు, ఖతర్ లో అత్యధిక శాతం తేనె అల్ షమల్ మరియు షీహరియా, అపిఅరీస్ ప్రాంతాల్లో ఉత్త్పత్తి చేస్తున్నారు. సిదర్ చెట్ల నుండి తేనెటీగలు సేకరించిన తేనె, స్థానికంగా లభించే తేనెలో ఎన్నో వైద్య విలువలు కలిగి అత్యధిక నాణ్యత కలిగిందని ఇక్కడ ప్రజల విశ్వాసం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







