తమిళనాడులో జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది..
- January 08, 2016
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో సంప్రదాయబద్దంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవిశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే జంతువులపట్ల క్రూరంగా వ్యవహరించవద్దంటూ పేర్కొంది. జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే జల్లికట్లు నిర్వహించాలని కేంద్రం షరతు విధించింది. ఎడ్ల పందాలకు కూడా అనుమతి లభించింది. తమిళనాడు ప్రభుత్వం అనుకున్నది సాధించుకుంది. తమిళనాడులోని జయ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. తమిళనాడు సంప్రదాయంలో జల్లికట్టు అంతర్భాగమని రెండువేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుందని తెలిపింది. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఇటీవలే ప్రధాని మోదీకి జయలలిత లేఖ రాశారు. మరోవైపు కేంద్ర ప్రభత్వం నిర్ణయంపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడులకు కేంద్రం లొంగిపోతోందంటూ విమర్శించారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







