మహిళా బస్ ప్యాసింజర్లు పెరిగారు
- January 08, 2016
దోహాలో గడచిన ఐదేళ్లలో మహిళా ప్యాసింజర్ల సంఖ్య పెరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కర్వా బస్ డ్రైవర్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. ట్యాక్సీలలో ప్రయాణించడం కన్నా బస్సుల్లో ప్రయాణించడం సురిక్షితమని మహిళా ప్రయాణీకులు భావిస్తున్నారట. ఫిలిప్పీన్స్, ఇండియా, శ్రీలంక నుంచి వచ్చిన మహిళా కార్మికులు ఎక్కువగా గల్ఫ్, ల్యాండ్ మార్క్, ఎజ్డాన్, విల్లాజియో, హయాత్ ప్లాజా, అల్ ఖోర్ మాల్ మరియు సిటీ సెంటర్ దోహా తదితర షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్నారనీ, వారిలో ఎక్కువమంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని కర్వా బస్ నిర్వాహకులు వెల్లడించారు. కర్వా బస్ డ్రైవర్ ఒరు 2010లో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య తక్కువగా ఉండేదనీ, ఆ సంఖ్య ఇప్పుడు ఎక్కువైందనీ అన్నారు. మహిళలు వీలైతే సొంత కార్లలో ప్రయాణించేందుకు ఇష్టపడ్తున్నారనీ లేదంటే బస్సులను ఆశ్రయిస్తున్నారనీ ట్యాక్సీలను ఎక్కువగా ఇష్టపడటంలేదని ట్యాక్సీ డ్రైవర్ ఒకరు చెప్పారు. దోహాలోని డ్రైవింగ్ స్కూల్స్‌లో శిక్షణ కోసం వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







