భాజపా నేతలు అల్‌ఖైదా హిట్‌లిస్టులో....
- January 08, 2016
దేశంలో అధికార భారతీయ జనతా పార్టీ అగ్రనేలపై అల్‌ఖైదా ఉగ్రవాదులు పగబట్టారు. తమ హిట్ లిస్టులో పలువురు బీజేపీ నేతల పేర్లు చేర్చుకున్నారు. వీరందరినీ హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందిచినట్టు వార్తలు వస్తున్నాయి. గత బుధవారం బెంగళూరులో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన సయ్యద్ అంజర్ షా ఖాజ్మిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన అనంతరం అల్‌ఖైదా హిట్‌లిస్టులో ప్రముఖ భాజపా నేతలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదిలావుండగా, ఈ ఉగ్రవాదినితి శుక్రవారం పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. జనవరి 20 వరకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి రాజకీయనాయకులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అల్‌ఖైదా భారత ఉపఖండంలో ఉగ్రదాడి జరిపేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఖాజ్మిని వద్ద జరిపిన విచారణలో వెల్లడైంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







