బీట్రూట్ కుర్మా
- January 08, 2016
కావలసిన పదార్థాలు: బీట్రూట్ దుంపలు - మూడు, ఉల్లిపాయలు - రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌స్పూను, గరంమసాల - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత. పెరుగు - ఒక కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికించిన నీళ్లను పక్కనపెట్టుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఎర్రగా వేయించాలి. అందులోనే ఉప్పు, కారం, గరం మసాల వేసి ఉడికించిన బీట్రూట్ ముక్కల్ని కూడా వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడికిన తర్వాత చివర్లో పెరుగు వేసి దించేయాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







