ఉగ్రవాదం విషయంలో బరితెగించిన పాక్
- September 10, 2019
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ బరితెగించింది. టెర్రరిస్టులపై చర్యలు తీసుకోకపోతే నిషేధం తప్పదని FATF చేసిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంది. తాజాగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ-ISI, ఉగ్రవాద సంస్థలతో సమావేశమైంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఖలిస్థానీ జిందాబాద్ నేతలతో ISI ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇస్లామాబాద్‌లోని సైనికాధికారికి చెందిన ఓ రహస్య ప్రదేశంలో ఈ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టికల్-370 రద్దు తర్వాతి పరిణామాలు, కశ్మీర్ పరిస్థితులపై ఈ మీటింగ్‌లో చర్చించినట్లు సమాచారం.
భారత్‌లో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ISI-టెర్రరిస్టు గ్రూపుల మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తమ తమ అజెండాలతో ముందుకు సాగాలని మీటింగ్‌లో నిర్ణయించినట్లు సమాచారం. భారీ స్థాయిలో దాడులు చేయాలని, మారణహోమం సృష్టించాలని ISI అధికారులు, ఉగ్రవాద కమాండర్లు నిర్ణయించినట్లు సమాచారం. సైన్యం సహకారంతో కశ్మీర్లోకి చొరబడాలని, అందుకు ISI సాయం తీసుకోవాలని ఉగ్రవాద నాయకులు తీర్మానించారు. ఖలిస్తాన్ మిలిటెం ట్లను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించారు. అమెరికా, కెనెడా, బ్రిటన్‌లో ఖలిస్థాన్ మద్ధతుదారులను రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ISI-ఉగ్రవాద సంస్థల మీటింగ్‌పై భారత నిఘా సంస్థలకు పక్కా సమాచారం లభించింది. మీటింగ్ వివరాలను సేకరించిన ఐబీ వర్గాలు, ఆర్మీ, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







