ఎన్నారైల సంక్షేమానికి ఎంత కేటాయించారు?
- September 10, 2019
హైదరాబాద్:2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను తేది: 22.02.2019న మరియు పూర్తి బడ్జెట్ ను తేది: 09.09.2019న ప్రవేశపెట్టారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే.. గత సంవత్సర బడ్జెట్ ప్రకారం కేవలం ఖర్చుల కొరకు మాత్రమే తాత్కాలిక / మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం పొందడం అని అర్థం. అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం.. అంతకుముందు సంవత్సరం ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించారు, కాబట్టి తాత్కాలిక బడ్జెట్ లో అదే కొనసాగింపు ఉన్నదని భావించాలి. (ఆ 100 కోట్లు ఖర్చు చేయలేదన్నది వేరే విషయం)
అప్పటి తాత్కాలిక బడ్జెట్ లో ఎన్నారైల సంక్షేమానికి మొదటి త్రైమాసికానికి రూ.16 కోట్లు కేటాయించారని సమాచారం. ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ లో పాతదానికి తోడు ఎంత అదనంగా కేటాయించారన్నది ఒక వారం వరకు స్పష్టత వస్తుంది.
బడ్జెట్ లో ఎంత కేటాయించినా... ఖర్చు చేయడానికి ఒక విధానం (పాలసీ) మరియు తగిన యంత్రాంగం లేకపోతె లక్ష్యం నెరవేరదు. కాబట్టి సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) లో భాగంగా 'తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయాలి. దీనికోసం శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టి ఒక చట్టం చేయాలి.
-మంద భీంరెడ్ది
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







