దొంగతనం చేసి వికృత చర్య.. యువతి పక్కన నగ్నంగా..
- September 11, 2019
దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. చివరకు జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగింది. క్యాలిఫోర్నియాలో చికో స్టేట్ యూనివర్సీటీలో చదివే 21 ఏళ్ల విద్యార్థిని నార్త్ కాలిఫోర్నియలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఈ నెల 9వ తేదీన ఆమె ఉంటున్న ఇంటికి సమీపంలోని ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు.
ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు. ఇంతలో పోలీసుల కంటపడి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పేందుకు యువతి గదిలోకి వెళ్లి ఆమె నిధిస్తుండగా ఆమె పక్కనే అతను కూడా బట్టలన్నీ విప్పేసి నిద్రించసాగాడు. కొద్దిసేపటితరువాత యువతి లేచి చూడగా అతను కనిపించాడు. యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







