భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి

భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి

అటెంషన్! అటెంషన్! భారతీయులకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు 25 రోజుల పెయిడ్ యాత్రను అందిస్తోంది ఒమాన్ లోని భరత రాయబార కార్యాలయం. మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేయండి.

ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీ 'Know India' ప్రోగ్రామ్. ఇందులో భాగంగా భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇండియా ను ప్రతిబింబిస్తూ లోగో ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని ఖర్చులు ఎంబసీ భరించి 25 రోజుల యాత్రను బహుమతిగా అందిస్తుంది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మీరు తయారుచేసే లోగో ప్రొఫెషనల్ గా ఉండాలని మర్చిపోకండి. ఈ పోటీ ప్రవేశానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2019 మరియు ఎంట్రీలను indembassy.muscat@mae.gov.in కు మెయిల్ చేయవచ్చు.

Back to Top