పాక్ శాశ్వత రాయబారి మలీహా లోధీ స్థానంలో మునీర్ అక్రమ్ నియామకం: ఇమ్రాన్
- October 01, 2019
ఇస్లామాబాద్: ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ శాశ్వత రాయబారి మలీహా లోధీకి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ షాకిచ్చారు. అమెరికా పర్యటనను ముగించుకుని ఇస్లామాబాద్ చేరుకున్న రెండు రోజులకే ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలని పాక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ విషయంలో లోధీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇమ్రాన్ చివరికి అతడిపై వేటేశారు. మలీహా స్థానంలో మునీర్ అక్రమ్‌ను నియమించారు.
ఐరాసలో పాక్ రాయబారిగా వెళ్లడం మునీర్‌కు ఇది రెండోసారి. 15 ఏళ్ల క్రితం ఐరాసలో పాక్ రాయబారిగా వ్యవహరించిన మునీర్ అప్పట్లో గృహ హింస కారణంగా పదవిని వదులుకున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఇమ్రాన్ యుద్ధోన్మాదంతో ఊగిపోయారు. కశ్మీర్ విషయంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసి చూడాలని భారత ప్రభుత్వానికి సవాలు విసిరారు. కాగా, కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూటగట్టడంలో పాక్ విఫలమైన సంగతిని ఇమ్రాన్ స్వయంగా అంగీకరించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







