సోనియా, మన్మోహన్ లతో బంగ్లా ప్రధాని షేక్ హసీన భేటి
- October 06, 2019
న్యూఢిల్లీ: ఆదివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ అధ్యక్ష్యరాలు సోనియా గాంధిలతో భేటి అయ్యారు. ఈ భేటిలో వీరితో పాటు ప్రియాంక గాంధి వాద్ర మరియు ఆనంద్ శర్మలు కూడా పాల్గొన్నారు.
ఈ భేటిలో భారత్౼బంగ్లా ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠత అంశం పై చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. నాలుగు రోజుల పర్యటనకై బంగ్లా ప్రధాని షేక్ హసీన భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమవేశంలో పాల్గొని పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. షేక్ హసీన సుదీర్ఝ కాలంగా బంగ్లాదేశ్ కు తన సేవలనందిస్తున్నారు. భారత్ లో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్న సందర్భంలో 2009లో షేక్ హసీన రెండవసారి బంగ్లా ప్రధానిగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







