దర్శకుల సంఘానికి రూ.10 లక్షల విరాళం ఇచ్చిన హీరో సూర్య
- October 11, 2019
తమిళ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన గొప్ప మనసుని చాటుకొన్నారు. తమిళనాడు చలన చిత్ర దర్శకుల సంఘానికి నటుడు సూర్య రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్య విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కుని సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ వీ ఉదయకుమార్ కు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్ కే సెల్వమణి, కోశాధికారి పేరరసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సూర్య నటించిన బందోబస్త్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగులో మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!