అధ్యయనం పేరిట కాలయాపన వద్దు:మంద భీంరెడ్డి
- October 12, 2019
హైదరాబాద్:గల్ఫ్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన నేపథ్యంలో తన అభిప్రాయం తెలిపిన ప్రవాసి కార్మిక నాయకులు మంద భీంరెడ్డి.ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) ముసాయిదా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నది. అధ్యయనం పేరిట కాలయాపన వద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత అయిదు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో గల్ఫ్ దేశాలలో మృతి చెందిన 1261 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని కెసిఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.
గల్ఫ్ లో ఉన్నవారిని వాపస్ తెప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలుపడం అనాలోచిత, బాధ్యతారాహిత్యం. సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండానే ప్రకటనలు చేయడం సరికాదు. అధికారుల బృందాన్ని కేరళరాష్ట్రానికి అధ్యయనానికి పంపడం కాలయాపన కొరకే.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో సమగ్ర ప్రవాసి సర్వే నిర్వహించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ఎన్నారై ల కొరకు ప్రత్యేక శాఖను ఏర్పాటై చేయాలి. ఒక మంత్రిని నియమించాలి. తెలంగాణ ప్రవాసి సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్, పెన్షన్, స్వయం ఉపాధి లాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!