15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ!
- October 15, 2019
టాలీవుడ్ లో సృజనాత్మక సినిమాలకు దర్శకత్వం వహించి ఓ ట్రెండ్ సృష్టించారు కృష్ణవంశి. రొమాంటిక్, దేశభక్తి, ఎంట్రటైన్ మెంట్ ఏ సినిమా అయినా కృష్ణవంశి మార్క్ చూపిస్తుంటారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య శిష్యుల్లో ఒకరైన కృష్ణవంశి 'గులాబి' సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. గులాబీ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం..అందులో పాటల చిత్రీకరణ చూసి, అక్కినేని నాగార్జున ఫిదా అయ్యారు.
కృష్ణవంశితో 'నిన్నే పెళ్లాడుతా' లాంటి ఫ్యామిలీ, లవ్, ఎమోషన్ లాంటి సినిమాతో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. 'పైసా' సినిమా తర్వాత కృష్ణవంశికి ఏదీ కలిసి రావడం లేదు. ఆ మద్య సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్ తో 'నక్షత్రం' సినిమా తీసి మరోసారి దారుణమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి కృష్ణవంశి మరో సినిమా కోసం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన రమ్యకృష్ణ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా రమ్యకృష్ణ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. 'బాహుబలి' సినిమాలో ఆమె పోషించిన 'శివగామి' పాత్ర ఆమె స్థాయిని పెంచేసింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో రమ్యకృష్ణ బిజీ నటిగా కొనసాగుతున్నారు. 'నక్షత్రం' తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ, ఒక విభిన్నమైన కథతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించబోతుందట. గతంలో కృష్ణవంశి దర్శకత్వంలో నితిన్, అర్జున్, ఛార్మీ నటించిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో నటించింది రమ్యకృష్ణ. దాదాపు 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







