ఎతిహాద్, ఎయిర్ అరేబియా 'లో కాస్ట్ ఎయిర్‌లైన్'
- October 16, 2019
యూఏఈకి చెందిన ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ అలాగే ఎయిర్ అరేబియా సంయుక్తంగా లో కాస్ట్ క్యారియర్ని ప్రారంభించే విషయమై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎతిహాద్ అలాగే ఎయిర్ అరేబియా ఈ మేరకు ఇండిపెండెంట్ జాయింట్ వెంచర్ కంపెనీని ప్రారంభించనున్నాయి. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో దీని హబ్ వుండబోతోంది. అబుదాబీ నుంచి వెళ్ళే విమానాలకు ఈ లో కాస్ట్ క్యారియర్స్ కాంపిలమెంట్ చేస్తాయి. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ ఛైర్మన్ టోనీ డగ్లస్ మాట్లాడుతూ, ఎయిర్ అరేబియాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రోగ్రామ్, అబుదాబీని ఈ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదెల్ అల్ అలి మాట్లాడుతూ, ఎతిహాద్‌తో కలిసి భాగస్వామ్యం పంచుకోవడం ఆనందంగా వుందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







