అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తలైవా..!
- October 19, 2019
చెన్నై:సినీ తారలంటే అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. కొంత మంది స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం ముందు నుంచి సందడి చేస్తుంటారు. పెద్ద కటౌట్స్ పెట్టి పాలభిషేకాలు చేస్తుంటారు. తమిళనాట రజినీకి ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమ దేవుడిగా కొలిచే వారు ఎంతో మంది ఉన్నారు. రజినీ తర్వాత ఆ స్థాయిలో విజయ్, అజిత్ లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటీవల ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మద్య కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. హిమాలయాల యాత్రకు వెళ్లిన ఆయన శుక్రవారం వచ్చారు. ఆయన రాకతో అభిమానుల్లో కోలాహలం నెలకొంది...రజినీ చుట్టు చేరి సెల్పీల కోసం ఎగబడ్డారు. తలైవా జిందాబాద్..ఐ లవ్ యూ అంటే కేకలు వేశారు. ఆ తర్వాత రజినీకాంత్ ఆయన కారు లో ఇంటికి వెళ్లిపోయారు..ఈ క్రమంలో ఓ అభిమాని బైక్ పై రజినీని ఫాలో అవుతూ ఆయన గెటు వరకు వెళ్లారు.
ఇది గమనించిన రజినీకాంత్ తన గార్డుతో ఆ అభిమానిని ఇంటిలోకి పిలిపించుకొని ఇలాంటి సమయంలో బైక్‌పై ప్రయాణం మంచిది కాదు. చాలా ప్రమాదకరమైంది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు అని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఒక ఫొటో దిగి పంపారట.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







