రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్ విడుదల
- November 09, 2019
ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత నేపథ్యంలో తెలుగు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాకి `రఘుపతి వెంకయ్య నాయుడు` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాబ్జీ దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. యూనిట్ అందరికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు పేర్కొనగా, 'రఘుపతి వెంకయ్యగారి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకూ ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది' అని నరేష్ అన్నారు. ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, శక్తిమాన్, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ తదితరులు నటించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!