'90ml' 'సింగిలు సింగిలు' పాట విడుదలకి ఫోరమ్ సుజనా మాల్ లో భారీ స్పందన!!
- November 17, 2019


హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ చిత్రంలో నటించిన రోల్ రైడా మరియు దర్శకుడు శేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో ఉర్రూతలూగిపోయింది. ఇదివరకు విడుదలైన 'ఇనిపించుకోరు ఇనిపించుకోరు' 'చాలు చాలు' పాటలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ పొందుతుండగా ఇప్పుడు విడుదలయిన ఈ పాట సింగిలు సింగిలు అని సాగుతూ సింగిల్ యువతని విపరీతంగా ఆకట్టుకోనుంది. ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.
నటీనటులు:
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, అజయ్ , ఆలీ , ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్.
సాంకేతిక నిపుణులు:
రచన-దర్శకత్వం: శేఖర్ రెడ్డి ఎర్ర
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: జె.యువరాజ్
ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
ఆర్ట్: జీఎం శేఖర్
పాటలు: చంద్రబోస్
ఫైట్స్: వెంకట్, జాషువా
కొరియోగ్రఫీ: జానీ
కో-డైరెక్టర్: బాస్ గూడూరి(సిద్ధు)
ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







