దుబాయ్‌లో కొత్త అడ్రస్ సిస్టమ్
- January 13, 2016
అడ్రస్ ద్వారా లొకేషన్‌ని గుర్తించడం ఇకపై తేలిక కానుంది దుబాయ్‌లో. ఎమిరేట్‌లోని కమ్యూనిటీస్‌ని 14 జిల్లాలుగా విభజించారు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) దుబాయ్ డిస్ట్రిక్ట్ అడ్రసింగ్ సిస్టమ్ తొలి మ్యాప్‌ని విడుదల చేసింది. ఇందులో 14 జిల్లాల్ని, మరియు అందులో కమ్యూనిటీస్‌ని పేర్కొంది. హదాయిక్ మహమ్మద్ బిన్ రషీద్ (మహమ్మద్ బిన్ రషీద్ గార్డెన్స్) డిస్ట్రిక్ట్, మహమ్మద్ బిన్ రషీద్ సిటీని కవర్ చేస్తుంది. ఇది ఫ్యామిలీ టూరిజం హబ్‌గా వుంటుంది. అల్ ఖోజ్, అల్ బర్షా, నద్ అల్ షీబా మరియు అల్ థన్యా ఇతర కమ్యూనిటీలు. మిగతా నాలుగు డిస్ట్రిక్ట్స్ విషయానికొస్తే మదినాత్ అల్ మక్తౌమ్ డిస్ట్రిక్ట్ - అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్ని కవర్ చేస్తుంది. మదినాత్ అల్ ఖద్రా మరియు అల్ వజీహా అల్ బహ్రియా డిస్ట్రిక్ట్స్ సౌత్ ఈస్ట్ మరియు సౌత్ వెస్ట్ ప్రాంతాల్ని కవర్ చేస్తుంది. దీరా, బుర్ దుబాయ్, నఖ్లత్ దీరా (పామ్ దీరా), ముష్రిఫ్, అల్ అవిర్, రస్ అల్ ఖోర్, జబీల్, జుమైరా, దుబాయ్ ల్యాండ్ మరియు జబెల్ అలీ ఇతర జిల్లాలు. ఆర్‌టిఏ ట్రాఫిక్ డైరెక్టర్ హుస్సేన్ అల్ బన్నా మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్ అడ్రస్ సిస్టమ్ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు రూపొందించబడిందని అన్నారు. తమ లొకేషన్‌ని ప్రజలు తెలుసుకోవడానికి ఈ కొత్త సిస్టమ్ ఉపయోగపడ్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







