'రోబో 2' సినిమాలో విలన్ అక్షయ్‌కుమార్!
- January 13, 2016
పాతికేళ్ల కెరీర్లో బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేశాడు అక్షయ్‌కుమార్. 'బేబీ', 'స్పెషల్ 26', 'ఎయిర్‌లిఫ్ట్', 'ఓ మై గాడ్' వంటి సందేశాత్మక సామాజిక చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించారు ఆయన. తాజాగా తొలిసారి తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు ఈ యాక్షన్ స్టార్. రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రోబో 2' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తొలిసారి తమిళ సినిమాలో నటిస్తున్న మొదటి బాలీవుడ్ నటుణ్ని తానేనని అక్షయ్‌కుమార్ చెప్పారు.'తమిళ సినిమాలో నటిస్తున్న తొలి బాలీవుడ్ నటుణ్ని నేనే కావడం చాలా ఆనందం కలిగిస్తోంది. దక్షిణాది సినిమాల్లో సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకుంటారు. బాలీవుడ్ హీరోలు దక్షిణాది సినిమాల్లో నటించరు. ఈ అపనమ్మకాన్ని నేను బ్రేక్ చేస్తున్నా. ఇప్పటివరకు మరాఠీ, పంజాబీ సినిమాల్లో నటించా. ఇకముందు గుజరాతీ, బిహారీ, బెంగాలీ సినిమాల్లో కూడా నటిస్తా' అని అక్షయ్ విలేకరులకు తెలిపారు.'రోబో -2' కథ తనకు ఎంతగానో నచ్చిందని, ఈ సినిమాలో ఓ సందేశం కూడా ఉందని, అయితే అదేమిటో ఇప్పుడే చెప్పబోనని ఆయన అన్నారు. ద్విభాష చిత్రంగా 'రోబో 2' తమిళం, హిందీలో తెరకెక్కుతున్నదా? అనే విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించలేదు. మరో నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, దాదాపు ఏడాది తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అప్పుడే అన్ని విషయాలు తెలిసే అవకాశముందని చెప్పారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







