మనసు
- May 17, 2015
మనసు అంటే ఏమిటో?
మెదడా? హృదయమా?
మనిషి మాటనూ చేతనూ
నియంత్రించేది మేధ
అంటే మెదడే కదా?
కానీ కవులంతా
గుండెతో
మనిషి స్పందననూ
ఆక్రందననూ
ముడిపెడతారుమరి!
"గుండె గొంతుకలోన
కొట్టాడుతోంది"
అంటాడొకకవి
"గుండె లోతును
కనిపెట్టే
ఏ మీటరూ
లేదంటా" డింకొకకవి
రక్తాన్ని అందుకుంటూ
ఒక నిర్ణీత వేగంలో
స్పందించటమే
గుండె కర్తవ్యం
అంటాడు సైంటిస్టు
పిడికెడు ప్రమాణంలో
లబ్ డబ్ ధ్వనితో
స్పందించే హృదయం
ప్రేమకు సింబల్ గా
మారటం విచిత్రం
పసివాడి చైతన్యంలో
యువకుడి ఆరాటంలో
వృద్ధుని జీవనపోరాటంలో
అన్నింటా ఈ గుండె
చప్పుడు వినిపిస్తూంటుంది
ఒక్కో సందర్భంలో
ఒక్కోలా
నీకు మెదడు లేదంటే
ఒక అర్ధం
నీకు హృదయం లేదంటే
వేరొక అర్ధం
మెదడు లేనివాణ్ణి
ప్రపంచం క్షమిస్తుంది
జాలి చూపుతుంది
హృదయం లేనివాణ్ణి
శపిస్తుంది
నిరసిస్తుంది
దిల్ ఔర్ దిమాగ్
రెండూ వేరేనని
భాష కూడా చెప్తోంది
కానీ హృదయానికి
నిజంగా స్వంతంగా
ఆలోచనలూ ఆవేశాలూ
ఆకాంక్షలూ ఆశయాలూ
ఉన్నాయా? ఉంటాయా?
మెదడుకు వచ్చే
వ్యాధులు వేరు
అనర్ధాలు వేరు
హృదయానికి వచ్చే
కంపనలూ ప్రకంపనలూ
ఆటుపోట్లూ వేరు
అయినా కవులు
గుండెతోనే ఆలోచిస్తారు
గుండెతోనే ఆరాధిస్తారు
కనీళ్ళకూ నవ్వులకూ
దురాశకూ నిరాశకూ
అన్నింటికీ
గుండెతోనే ముడిపెడతారు
అనుభూతి గొప్పదా?
విజ్ఞానం గొప్పదా?
అంతు చిక్కని సమస్య ఇది
మనిషికి మాత్రమే
అన్వయించే ప్రశ్న ఇది
కాలాన్ని కరిగించుకోవటం
మినహాయించి
కాలానికి దొరకని సమాధానం
విడదీయలేని చిక్కుముడి ఇది!
--- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్టణం.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







