సొంత వైద్యం వద్దే వద్దు
- May 17, 2015
వంటింట్లో లభించే అనేక రకాలైన దినుసులు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. సొంతింటి వైద్యం అంటే, సైడ్ ఎఫెక్ట్స్ లేని వంటింటి వైద్యం అని మాత్రమే. కానీ మందుల్ని వాడేటప్పుడు మాత్రం సొంత వైద్యం పనికిరాదు. డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి మందులైనా ఉపయోగించడం ప్రమాదకరమే అవుతుంది. జ్వరానికీ, తలనొప్పికీ, చిన్న చిన్న విషయాలకీ సొంత వైద్యాన్ని ఉపయోగించేస్తుంటాం. ముందస్తుగా వైద్యుల సలహా తీసుకుని పారాసెట్మాల్, పెయిన్ కిల్లర్స్ వంటివాటిని అరుదుగా ఉపయోగిస్తే కొంతవరకూ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒక్కరోజుకి మించి పారాసెట్మాల్ అయినా, పెయిన్ కిల్లర్స్ అయినా ఉపయోగించినప్పుడు అది ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే మందుల్ని వాడేటప్పుడు చిట్కా వైద్యం తరహాలో ఉపయోగించేయకూడదు. ఒక్కోసారి మందుల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కొత్త రోగాలు మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. అందుకే సొంత వైద్యం అన్న మాటకి టాటా చెప్పేయండి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







