కీరాదోసలో ఆరోగ్య ప్రయోజనాలు...
- January 14, 2016
నీటిశాతాన్ని ఎక్కువగా కలిగి ఉండే దోసకాయ తింటే తినాలపిస్తుంది. చల్లగా.. స్వీట్ నెస్ ఎక్కువగా లేకుండా.. రుచికరంగా ఉండే అద్భుతమైనది దోసకాయ. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. దీన్ని తినడం వల్ల శరరీంలోని విషపదార్థాలు తొలగిపోయి, కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా దోసకాయ చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా ? ఐతే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరాదోస ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ చేస్తుంది. కీరాదోసను రోజూ సలాడ్స్లో భాగం చేసుకోవడం లేదంటే కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగుతో కలిపి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే స్టెరోల్స్ అనే సమ్మేళనం శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.కీరా దోసకూడా కిడ్నీలను, నాడీవ్యవస్థను మెరుగు పరుస్తుంది. దోసకాయ మూత్ర పిండాల పనితీరుకు దోహద పడుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రించే గుణం కీరా దోసలో ఉండటం వల్ల మూత్రపిండంలో రాళ్లు ఏర్పడవు. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం, సోడియంలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే కీరా బీపీ, హై బీపీ పేషెంట్లకు మేలు చేస్తుంది. కాబట్టి బీపీ, హైబీపీతో బాధపడేవాళ్లకు రెగ్యులర్ డైట్ లో దోసకాయ చేర్చుకోవడం మంచిది.మధుమేహంతో బాధపడేవాళ్లకు కూడా దోసకాయ చక్కటి పరిష్కారం. దోసకాయ అరగటానికి సమయం పడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం తీసుకోకపోయినా.. రక్తపోటును సమతుల్యంలో ఉంచటానికి కీరా సహాయపడుతుంది. కీరా దోసలో ఫైసెటిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లేవనాల్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.దోసకాయ తీసుకోవడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఉంది. చిగుళ్ల సమస్యతో బాధపడేవారికి దోసకాయ చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కీరాలోని సిలికా కణాలు చర్మం కాంతివంతంగా మృదువుగా మారడానికి సహాయపడతాయి. కళ్ల కింద నల్లటి వలయాలను కూడా నివారిస్తుంది. సిలికాన్, సల్ఫర్ లు సమృద్ధిగా ఉండే కీరా జుట్టు పెరుగుదలకి కూడా తోడ్పడుతుంది.ప్రాణాంతక క్యాన్సర్ ని దూరం చేసే ఫుడ్ హ్యాబిట్స్క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించే సత్తా కూడా కీరా దోసలో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో ఉండే లిగ్నాన్స్.. ఫైటోన్యూట్రియంట్ సమ్మేళనాలే. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతుంది. దోసకాయలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలోనూ కీరాదోస ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్న కీరా దోసకాయను నిర్లక్ష్యం చేయరు కదూ..!!
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









