కాజు-బొప్పాయి ముర్జీ
- January 14, 2016
కావలసిన పదార్థాలు : బాగా పండిన బొప్పాయి పండు - చిన్నది, పంచదార - రెండు కప్పులు, నెయ్యి - కప్పు, యాలకులు పొడి- అర చెంచాజీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది) - మూడు చెంచాలు బాదం తరుము - రెండు చెంచాలు, ఆరెంజ్ లేదా రెడ్ కలర్ - పావు చెంచా(ఇష్టమైతేనే), మైదా - అర కప్పు, చిక్కటి పాలు - కప్పు, బాదం పప్పు ముక్కలు - చెంచా, కిస్మిస్ - 12, పచ్చి కొబ్బరి - పావు కప్పు.
తయారీ విధానం :
ముందుగా బొప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్మిస్లు అందంగా అలంకరిస్తే సరి ‘కాజు-బొప్పాయి ముర్జీ’ రెడీ అయినట్టే. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







