విజయ్ దేవరకొండ సాయం విజేతగా నిలిపింది
- February 15, 2020
హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది. మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి టీపడుతున్నాడు.కానీ అక్కడ పాల్గొనేందుకు కావాల్సిన ఫీజ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు..ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ 24 వేలు ఆర్థిక సహాయం చేశారు.ఫిబ్రవరి 1న ఆ చెక్ ను దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్ కు అందజేశారు.
ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్ళిన గణేష్ ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు.యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించాననీ గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







