ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసిన 'ఏమైపోయావే' మోషన్ పోస్టర్
- February 15, 2020
శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'ఏమైపోయావే'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మోషన్ పొస్టర్ ను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''ఏమైపోయావే' టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బావుంది. ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధించి చిత్ర యూనిట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా'' అన్నారు.
నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ - ''మా బ్యానర్లో 'ఏమైపోయావే' చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. మేము అడిగిన వెంటనే మా చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం'' అన్నారు.
రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్, సినిమాటోగ్రఫీ: శివ రాధోడ్, సంగీతం: రామ్ చరణ్, పాటలు: తిరుపతి జానవ, పీఆర్వో: సాయి సతీష్, నిర్మాత: హరి కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







