కోవిడ్-19పై యుద్ధానికి ముందుకొస్తున్న టెక్ కంపెనీలు..తాజాగా ఫేస్బుక్
- March 23, 2020
న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19పై యుద్ధానికి ముందుకొస్తున్న టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ఫేస్బుక్ కూడా చేరింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా 7.2 లక్షల ఫేస్ మాస్క్‌లను విరాళంగా పంపినట్టు ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకెర్‌బర్గ్ వెల్లడించారు. మరోవైపు తాము ఇప్పటికే సిద్ధం చేసి పంపిన ఫేస్‌మాస్క్‌లు రవాణా మధ్యలో నిలిచిపోయాయని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అమెరికాలో కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న సీటెల్ కోసం ఆయన పెద్దఎత్తున వ్యక్తిగత సంరక్షక వస్తువులను పంపించారు. అయితే ఆయన పంపిన వస్తువులు ఎందుకు ఆగిపోయాయన్న విషయం ఆయన వెల్లడించకపోయినప్పటికీ.. లాస్ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న లాజిస్టిక్ సమస్యలే దీనికి కారణమని చెబుతున్నారు.
ఫేస్బుక్ జర్నలిజం ప్రాజెక్టు విభాగం సైతం కరోనా వైరస్‌పై న్యూస్ రిపోర్టింగ్ కోసం మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ సహ యజమాని జాక్ మా సైతం ప్రపంచ దేశాల కోసం ఫేస్ మాస్కులు, టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, సంరక్షక సాధనాలు పంపిణీ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీటెల్ ప్రాంత వాసులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







