కరోనా కట్టడికి మోదీ కీలక నిర్ణయం…

- March 23, 2020 , by Maagulf
కరోనా కట్టడికి మోదీ కీలక నిర్ణయం…

ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఇండియాలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించగా.. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు కరోనా పరీక్ష సామర్ధ్యాన్ని పెంచుతూ.. దేశవ్యాప్తంగా 12 డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు కరోనా పరీక్షలకు అనుమతినిచ్చింది. వీటితో పాటు మరో 15,000 కలెక్షన్ సెంటర్లకు కూడా అనుమతులు జారీ చేసింది. దీనితో ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రావడంతో కరోనా పరీక్షల సామర్ధ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు కోవిడ్ 19 కారణంగా ఇప్పటికే 19 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. అటు ఆరు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు షట్ డౌన్ అయ్యాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి.. అన్నీ సర్వీసులు బంద్ కానున్నాయని ఆ రాష్ట్ర సీఎం పళణి స్వామి వెల్లడించారు. అటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైనా దిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అటు దేశీయ విమాన సర్వీసులను కూడా రేపటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. అయితే కార్గో విమాన సర్వీసులు మాత్రం యధాతధంగా నడుస్తాయని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com