వారంలో పాస్‌పోర్ట్!
- January 28, 2016
పాస్‌పోర్ట్‌కి దరఖాస్తు చేసి దాని కోసం నెలలు నెలలు ఎదురు చూసే అవసరం ఇకపై రాకపోవచ్చు. ఎందుకంటే అందుకు అనుగుణంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేపట్టింది. ఈ విషయమై ఆ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జారీ ప్రక్రియ వేగవంతం చేసి వారంలో పాస్‌పోర్ట్ జారీ అయ్యేలా విధానాన్ని మార్పు చేస్తున్నట్లు చెప్పారు.
సాధారణ కేటగిరీ కింద పాస్‌పోర్ట్‌ని వేగంగా పొందాలనుకునే పౌరులు నాలుగు డాక్యుమెంట్లను స్థానిక పాస్‌పోర్ట్ సేవా కార్యాలయంలో పొందుపరిస్తే చాలని తెలిపారు.
సమర్పించాల్సిన పత్రాలు
* ఆధార్‌కార్డు
* ఓటరుకార్డు
* పాన్‌కార్డు
* పై మూడింటి నకళ్లతో పాటు పాస్‌పోర్ట్ దరఖాస్తు, సిటిజన్‌షిప్, కుటుంబ వివరాలు, నేర చరిత్ర లేదని పేర్కొనే అఫిడవిట్
ఇప్పటి వరకు దరఖాస్తుకు సంబంధించి పోలీస్ వెరిఫికేషన్ తదితరాలు జరపడానికి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దాదాపుగా నెల సమయం తీసుకునేవి. అందువల్ల చాలా సమయం వృధా అయ్యేది. అయితే ఇప్పుడు కొత్తగా చేసిన మార్పులతో తొందరగా పాస్‌పోర్ట్ వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ కొత్త విధానంలో దరఖాస్తుతోపాటు సమర్పించిన పాన్, ఆధార్, ఓటర్ కార్డుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రస్తుత డాటాతో సరిపోలాయో లేదో తొలుత చూసుకుంటారు. దరఖాస్తుదారుడికి నేర చరిత్ర లేదని ధ్రువీకరించుకుని వెంటనే పాస్‌పోర్ట్‌ని జారీ చేస్తారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







