'కబాలి' బిజినెస్ స్పీడ్..
- January 28, 2016
రజనీకాంత్ న్యూఫిల్మ్ 'కబాలి' గురించి లేటెస్ట్ న్యూస్. ఈ సినిమా బిజినెస్ స్పీడ్‌గా సాగుతోంది. టీజర్ కూడా రిలీజ్ రాకముందే వివిధ ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అమెరికాలో సినీ గెలాక్సీ.. తెలుగు- తమిళ వెర్షన్స్ కలిపి సుమారు 8.5 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఆస్ర్టేలియాలో అయితే కోటి 65 లక్షలకు వెళ్లినట్టు చెబుతున్నాయి. మలేషియా రైట్స్ కోసం ఇద్దరు డిస్ర్టిబ్యూటర్స్ పోటీపడుతున్నారట. 'రోబో' తర్వాత ఇలా రజనీ మూవీ అమ్ముడుపోవడం ఫస్ట్ టైమ్.కొచ్చాడయాన్, లింగా వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయినా సూపర్‌స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని, ఎలాంటి ప్రభావం చూపలేదనడానికి ఇదే ఎగ్జాంఫుల్ అని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు.దీనికితోడు రిలీజైన పోస్టర్ కూడా 'బాషా' స్టయిల్లో వుండడం మరో ప్లస్ పాయింట్. ఎట్ ప్రజెంట్ మలేషియాలోవున్న యూనిట్.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ అంతా ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేశారు. అన్నీఅనుకున్నట్లుగా జరిగితే తమిళం, తెలుగులోనూ మే 1న రిలీజ్ చేయాలన్నది ప్రొడ్యూసర్ స్కెచ్. తొలుత తమిళ న్యూఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, విజయ్ ఫిల్మ్ వుండడంతో 'కబాలి' సమ్మర్‌కి వెళ్లింది. రంజిత్ డైరక్షన్ చేస్తున్న ఈ మూవీలో రాధికాఆఫ్టే హీరోయిన్.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







