స్టార్ షట్లర్ పీవీ సింధు నటించేందుకు సిద్ధo...
- January 28, 2016
తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే నటించేందుకు సిద్ధమని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. అయితే ఈ సినిమా ఎవరు తీస్తారు, ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారనే దానిపై తన నిర్ణయం ఆధారపడి ఉంటుందని అంది. అన్ని కుదిరితే నటించడానికి తనకేమీ అభ్యంతరం ఉండబోదని వెల్లడించింది.మ్యూజిక్ అంటే తనకెంతో ఇష్టమని 20 ఏళ్ల సింధు తెలిపింది. సినిమాలు ఎక్కువగానే చూస్తుంటానని చెప్పింది. సానియా మీర్జా, సైనా నెహ్వాల్ పద్మభూషణ్ పురస్కారాలు రావడంతో 'ఎస్' అక్షరం తమకు అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. సింధు గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే.బ్యాడ్మింటన్ లో మరింతగా రాణిస్తానన్న నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది.అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తానని సింధు తెలిపింది. తాజాగా రెండోసారి మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆడుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







