సౌదీలో చలి తీవ్రతతో స్కూల్స్ మూసివేత
- January 28, 2016
సౌదీ అరేబియా ఉత్తర సరిహద్దు ప్రాంతంలో మంచు కురిసింది. అరార్ సిటీ మరియు హజ్మ్ అల్ జలామీద్లలో మంచు కురియడంతోపాటు, శీతలగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అదికారులు అన్ని స్కూళ్ళలోనూ తరగతులకు సెలవు ప్రకటించారు. మరింత మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సౌదీ రెడ్ క్రిసెంట్ సొసైటీ, కష్టతరమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంతవరకు రోడ్లపై ప్రయాణాలు మంచివి కాదని హెచ్చరించారు. చిన్న పిల్లలు, వృద్ధులు వెచ్చదనం కోసం తగిన శ్రద్ధ తీసుకోవాలని అధికారులు చెప్పారు. సున్నా స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు సహాయకారిగా ఉండేందుకు అధికారులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







