కోవిడ్ 19: కార్మికుల నివాస ప్రాంగణాల్లో కార్మిక మంత్రిత్వ శాఖ ముమ్మర తనిఖీలు
- May 04, 2020
దోహా:నగరాలు, పట్టణాల్లోని కుటుంబ నివాసల మధ్య కార్మికులకు కల్పించిన వసతి ఏర్పాట్లపై కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా కార్మికుల నివాస గదుల్లో కార్మికుల సంఖ్యను తగ్గించాలని గతంలోనే ఖతార్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది. ఐదుగురికి మించి ఒక్కరు కూడా ఎక్కువగా ఉండేందుకు వీల్లేదని తీర్మానం చేసింది. మహిళా కార్మికులు, ఇంట్లో పని చేసే వాళ్లకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినా ఇతర రంగాల్లో పని చేసే పారిశ్రామిక కార్మికుల నివాస ఏర్పాట్లపై నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని గతంలోనే ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 2019 లా నెంబర్.22 ఆధారంగా 2010 లా నెంబర్ 15 నిబంధనను సవరించింది.
కుటుంబ నివాసాల మధ్య కార్మికులకు ఏర్పాటు చేసే వసతి గృహాల్లో ఎంత మంది ఉంటున్నారు? కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో పరిశీలిచేందుకు కార్మిక, సాంఘిక సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దోహాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీ, పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారుల సహాకారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే చోట ఎక్కువ మంది ఉంటే..ఆయా వసతి గది బయట వారి వివరాలనుతో కూడిన పోస్టర్లను అంటించారు. నిబంధనలకు కన్న ఎంతమంది ఎక్కువగా ఉన్నారు..తనిఖీలు చేపట్టిన రోజు..ఎప్పటిలోగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కార్మికులు ఖాళీ చేయాల్సి ఉంటుందనే వివరాలన్ని ఈ పోస్టర్లలో పేర్కొంటున్నారు. దాదాపుగా తనిఖీ చేపట్టిన తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్న కార్మికులు గదులను ఖాళీ చేసేందుకు వారం రోజుల గడువు ఇస్తున్నారు.
ఇప్పటివరకు దోహాలోని దాదాపు 417 వసతి గృహాలను తనిఖీ చేసిన అధికారులు 1855 కంపెనీలు, సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. తనిఖీలు చేపట్టిన నాటి నుంచి వారం రోజుల్లో గదుల్లో ఐదుగురికి మించి ఎక్కువ సంఖ్యలో ఉన్న వారిని ఖాళీ చేయించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆరు నెలల జైలు శిక్ష, QR 50,000 నుంచి QR 100,000 వరకు జరిమానా విధిస్తామన్నారు. లేదంటే జరిమానాగానీ, జైలు శిక్షగానీ విధించే అవకాశాలు ఉన్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







