వచ్చే ఏడాది ఆక్టోబర్1 నుంచి దుబాయ్ ఎక్స్ పో ప్రారంభం..
- May 04, 2020
దుబాయ్:ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన దుబాయ్ వరల్డ్ ఎక్స్ పో కొత్త తేదీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఆక్టోబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఎక్స్ పో నిర్వహించేందుకు బీఐఈ సభ్య దేశాలు దాదాపుగా నిర్ణయించాయి. వరల్డ్ ఎక్స్ పో ఆతిథ్య యూఏఈ...ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారీ ఏర్పాట్లను చేసింది. ప్రత్యేక రోడ్లు, పెద్ద పెద్ద స్వాగత ద్వారాలు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ఔట్ లెట్లు, భారీ డిస్కౌంట్లతో ఆహ్వానితులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వ హంగులతో సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఎక్స్ పో ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి ప్రబలటంతో వరల్డ్ ఎక్స్ పో పై స్టీరింగ్ కమిటి పునరాలోచనలో పడింది. వైరస్ నేపథ్యంలో ఎక్స్ పోను వాయిదా వేస్తూ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు.
అయితే..ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్స్ పో నిర్వహణ సాధ్యం కాదని యూఏఈ ప్రభుత్వం, ఎగ్జిక్యూటీవ్ కమిటీ బీఐఈకి తేల్చి చెప్పింది. బీఐఈ కూడా యూఏఈ ప్రభుత్వం ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే..సభ్య దేశాల అభిప్రాయాలు తెలసుకునేందుకు ఓటింగ్ చేపట్టింది. ఎక్స్ పో నిర్వహణను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే అభిప్రాయంపై సభ్య దేశాల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటూ బీఐఈ కోరింది. ఏప్రిల్ 24 నుంచి ఓటింగ్ చేపట్టింది. మే 29 వరకు సభ్య దేశాలు తమ ఓటును వినియోగించుకోవచ్చు. అయితే..ఓటింగ్ ప్రారంభమైన వారంలోనే ఎక్స్ పో వాయిదాకు రెండింట మూడొంతుల సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి ఎక్స్ పో ప్రారంభం కానుంది. అయితే..ఈ విషయాన్ని ఓటింగ్ గడువు ముగిసిన తర్వాత బీఐఈ లాంఛనంగా ప్రకటించనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







