భారత్:ఒక్క రోజే 3,900 కేసులు
- May 05, 2020
భారత్లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 46,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా, ఒక్క రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు 12,726 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,568 మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 32,138 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 11 లక్షలకుపైగా కోవిడ్ టెస్టులు చేశారు.దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యలో సగానికి పైగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలలోనే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 14, 541 కరోనా కేసులు నమోదు కాగా, 583 మంది మృతిచెందారు. గుజరాత్లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్తాన్లో 3,061, మధ్యప్రదేశ్లో 2,942, ఉత్తరప్రదేశ్లో 2,776 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ మూడోదశ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మే 17 వరకు లాక్డౌన్ను పొడిగించిన కేంద్రం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను సడలించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







