కరోనా వైరస్: ఇండియాకి రిపాట్రియేషన్ టిక్కట్ల ధరలు సాధారణమే

- May 05, 2020 , by Maagulf
కరోనా వైరస్: ఇండియాకి రిపాట్రియేషన్ టిక్కట్ల ధరలు సాధారణమే

కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. కాగా, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల్ని రప్పించేందుకోసం ప్రత్యేక ప్రణాళికల్ని భారత ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మరోపక్క, ఈ రీపాట్రియేషన్ సందర్భంగా టిక్కెట్ ధరలు సాధారణంగానే వుంటాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటిదాకా ఈ ధరలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాగా, విమానాల్లో సోషల్ డిస్టెన్సింగ్ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోబడ్తాయని తెలుస్తోంది.  ప్రస్తుతానికి టిక్కెట్ ధరలపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోయినా, సాధారణ ధరలకు మించి ఎక్కువ ధరలకు టిక్కెట్లు విక్రయించే పరిస్థతి వుండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈ నుంచి కొచ్చి అలాగే కోజికోడ్ తదితర ప్రాంతాలకు వెళ్ళే తొలి దఫా ప్రయాణీకుల లిస్ట్ త్వరలోనే వెల్లడి కానుంది. మే 7 నుంచి విమానాలు నడిచేందుకు అవకాశం వుంది. దేశ చరిత్రలో అతి పెద్ద ఎవాక్యుయేషన్ ప్రక్రియగా దీన్నియూఏఈలో భారత అంబాసిడర్ పవన్ కపూర్ చెబుతున్నారు. ఫ్లయిట్ మేనిఫెస్టోని తయారు చేసి, ఎవరు ఏ విమానంలో వెళతారో నిర్ణయించనున్నట్లు ఆయన వివరించారు. వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ అయినవారికి తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు చెప్పారాయన. మొత్తం 200,000 మంది యూఏఈ నుంచి ఇండియాకి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారని, ఈ మేరకు వారంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు పవన్ కుమార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com