హైదరాబాద్‌లో వడగళ్ల వర్షం..
- May 31, 2020
హైదరాబాద్:హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో హైదరాబాద్ నగరంపై వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. LBనగర్, దిల్‌షుక్‌నగర్, హయత్‌నగర్, మలక్‌పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట లో భారీ వర్షం పడింది. కోఠిలో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు పరుగులు పెట్టారు.
హైదరాబాద్‌లో భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జాం అయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది.ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిపోయిన నగర జీవికి.. తాజా వర్షం కాస్తా ఉపశమనాన్ని కలిగించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







