సౌదీ:వేసవిలో పని వేళలకు సంబంధించి 450 చోట్ల నిబంధనల ఉల్లంఘన

- July 01, 2020 , by Maagulf
సౌదీ:వేసవిలో పని వేళలకు సంబంధించి 450 చోట్ల నిబంధనల ఉల్లంఘన

రియాద్:వేసవిలో భగ్గున మండే ఎండల్లో కార్మికులకు విశ్రాంతి కల్పించాలన్న నిబంధనలు కొన్ని కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయి. అలా దాదాపు నిబంధనల ఉల్లంఘన కేసులను 450 వరకు గుర్తించినట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో అధికారుల బృందం చేపట్టిన తనిఖీల్లో ఉల్లంఘన కేసులు బయటపడ్డాయి. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పని చేయించకూడదని

మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు..విరామ సమయంలో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా సూచించింది. అయితే..మంత్రిత్వ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా కార్మికులతో పని చేయిస్తున్నట్లు తనిఖీలు చేపట్టిన అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీలు, సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తమ తనిఖీలు ఇక ముందు కూడా కొనసాగుతాయన్నారు. ఎవరైనా పనివేళల్లో నిబంధనలు పాటించకుంటే 19911కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కూడా అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com