'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయినట్టుగా కమల్ ప్రకటించారు
- February 04, 2016
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్ గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్ కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది.ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







