దుబాయ్ ఫ్రేమ్: దుబాయ్ దర్శని
- February 04, 2016
దుబాయ్ 50 ఏళ్ళలో సాధించబోయే ప్రగతికి సంబంధించి 'దుబాయ్ ఫ్రేమ్' అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 'దుబాయ్ ఫ్రేమ్' 2016 ద్వితీయార్ధంలో సాధారణ ప్రజల కోసం ఓపెన్ చేయబడుతుంది. దుబాయ్ ఫ్రేమ్‌లో గతం గురించీ, ప్రస్తుతం గురించీ కూడా ప్రస్తావించనున్నారు. 50 ఏళ్ళలో దుబాయ్ సాధించబోయే ప్రగతి గురించి కూడా ఇందులో పొందుపర్చామని జనరల్ ప్రాజెక్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ దుబాయ్ మునిసిపాలిటీ ఆర్కిటెక్ట్ షాజా మహమ్మద్ బుష్రా ఫావౌద్ చెప్పారు. గతం, ప్రస్తుతం, భవిష్యత్ వంటి అంశాలు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసేలా దుబాయ్ ఫ్రేమ్‌ని రూపొందించారట. మొదట పాత తరంలో దుబాయ్, తర్వాత ప్రస్తుత తరం, చివరగా రానున్న యాభయ్యేళ్ళలో దుబాయ్‌లో వచ్చే మార్పులు ఉంటాయి. మెజ్జానైన్ ఫ్లోర్ నుంచి ఎలివేటర్ ద్వారా ఎగ్జిట్ అయి, వోర్టెక్స్ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తారు. ఇందులో స్పెషల్ లైట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌తో సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నారు నిర్వాహకులు. 205 మిలియన్ దిర్హామ్‌లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ రెండున్నరేళ్ళ సమయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఫీజ్‌ని ఇంకా ఖరారు చేయలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







