నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పై స్పష్టత
- February 04, 2016
రాయల్ ఒమన్ పోలీస్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల విషయమై స్పష్టత ఇచ్చారు. రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్సెస్, మార్గదర్శకాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. బ్రిగేడియర్ హిలాల్ అల్ బుసాదీ, సుదీర్ఘమైన ఈ ప్రకటనలో కంపెనీకి చెందిన ఆథరైజ్డ్ రిప్రెజెంటేటివ్, డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్సెస్ వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ని కన్‌ఫర్మ్ చెయ్యాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా నో అబెక్షన్ సర్టిఫికెట్ వివాదం వలసదారుల్ని తీవ్ర అయోమయానికి గురిచేసింది. ఈ కారణంగా రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టతనివ్వడం జరిగింది. ఓ సంస్థలో ఉద్యోగం మానేసి, వేరే సంస్థలో ఉద్యోగం కోసం అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ ఉద్యోగంలో చేరేందుకు రాయల్ ఒమన్ పోలీసులు అంగీకరించడంలేదు. ఇమ్మిగ్రేషన్‌లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంగీకరించకపోవడంతో సమస్య వచ్చిపడుతోంది. ఈ సమస్య పరిష్కారం దిశగా తీసుకున్న చర్యల పట్ల వివిధ కంపెనీలు అలాగే వలసదారులూ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







