పాతికేళ్ళ యువకులకు క్యాబినెట్లో చోటు
- February 04, 2016
యూఏఈ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ట్విట్టర్ ద్వారా సంచలన ప్రకటన చేశారు. క్యాబినెట్లోకి గ్రాడ్యుయేషన్ పూర్తయిన ముగ్గురు యువకుల్ని, ముగ్గురు యువతుల్ని యూనివర్సిటీలు నామినేట్ చేయవచ్చని, వారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు షేక్ మహమ్మద్. యువత దేశానికి వెన్నెముక అనీ, వారి ఆలోచనలు దేశాభివృద్ధికి ఉపయోగపడ్తాయని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పాతికేళ్ళలోపువారికి ఈ అద్భుత అవకాశం దక్కనుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మరియు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ డాక్టర్ అబ్దుల్లా అల్ కరమ్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. దేశ అభివృద్ధిలో ఇదో కీలకమైన ముందడుగుగా ఆయన కొనియాడారు. షేక్ మహమ్మద్ నిర్ణయంపై యువత నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని యువత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







