22 మూవీలో నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది- విక్రమ్‌జీత్ విర్క్
- July 19, 2020
22 మూవీ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్. నా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యి ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. నేను పూరి జగన్నాథ్ గారి హార్ట్ ఎటాక్ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఆయన శిష్యుడు శివ కుమార్ దర్శకత్వంలో మెయిన్ విలన్‌గా చేయడం సంతోషంగా ఉంది. అని అన్నారు బాలివుడ్ నటుడు విక్రమ్‌జీత్ విర్క్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 22. ఈ మూవీలో విక్రమ్‌జీత్ విర్క్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. జులై 19 ఆయన పుట్టిన రోజు సందర్భంగా 22 మూవీ నుండి విక్రమ్ స్టైలీష్ లుక్ ని విడుదలచేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ``శివ చాలా టాలెంటెడ్ పర్సన్. మొదటి సినిమా అయినా చక్కగా హ్యాండిల్ చేశారు. రూపేష్ మంచి నటుడు. తనకి తప్పకుండా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా 22 తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బి.వి.రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, సౌండ్ మిక్సింగ్: ఇ. రాధాకృష్ణ.ప్రొడక్షన్ మేనేజర్: కిరణ్ కాసా, పిఆర్ఓ: బి.ఎ రాజు, చీఫ్ కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శివకుమార్ బి.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







