'గుంటూర్ టాకీస్'. ఈ చిత్రం ట్రైలర్‌ను బాలకృష్ణ ఆవిష్కరించారు...
- February 04, 2016
'కొన్ని పాత్రలు చూసినప్పుడు నేను కూడా ఇన్ స్పైర్ అవుతుంటా. నటనలో నేనూ నిత్య విద్యార్థినే. నేను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ జరగడం సంతోషంగా ఉంది. 'చందమామ కథలు'తో జాతీయ అవార్డందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గుంటూర్ టాకీస్' ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది'' అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సిద్ధు జొన్నగడ్డ, నరేశ్, రేష్మీ గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, మహేశ్ మంజ్రేకర్ ముఖ్యపాత్రల్లో ఆర్‌కె స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం.నిర్మించిన చిత్రం - 'గుంటూర్ టాకీస్'. ఈ చిత్రం ట్రైలర్‌ను బాలకృష్ణ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ''అగ్ర హీరో బాలకృష్ణ గారు మా చిత్రం ట్రైలర్ ఆవిష్కరణకు రావడం మాకు కొత్త బలాన్నిస్తోంది'' అని దర్శకుడు అన్నారు. ''ఏ భాషలో తీసినా ఘన విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న యూనివర్సల్ కథ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది'' అని సీనియర్ నరేశ్ తెలిపారు. రేష్మి గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, సిద్ధు జొన్నగడ్డ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ తదితరులు మాట్లాడారు. కెమేరామ్యాన్ రామిరెడ్డి, ఎడిటర్ ధర్మేంద్ర, నటుడు రాజా రవీంద్ర, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







