ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలకు కథలు చెప్పి ఓకే చేసిన పూరి
- February 04, 2016
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకేరోజు ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు కథలు చెప్పి ఓకే చేయించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఒక కథ, డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌కి ఒక కథ చెప్పి.. ఈ రెండు కథల్ని ఒకేరోజు ఓకే చేయించుకున్నారు పూరి జగన్నాథ్. సాధారణంగా ఐదారు కథలు చెప్పి 20, 30 సిట్టింగ్స్ వేస్తేగానీ కథలు ఓకే అవ్వని ఈరోజుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు వేర్వేరుగా కథలు చెప్పి ఒకే సిట్టింగ్‌లో ఓకే చేయించడం పూరి వల్లే సాధ్యమేంది.ఈ అరుదైన రికార్డ్‌ను సాధించిన పూరి జగన్నాథ్‌కి హ్యాట్సాఫ్ చెప్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ చెయ్యబోతున్న సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది.ఎన్టీఆర్ కాంబినేషన్లో పూరి జగన్నాథ్ చెయ్యబోయే సినిమాను ఏ బేనర్లో చెయ్యబోతున్నారు, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







