అరటిపండు హల్వా
- February 05, 2016
కావలసిన పదార్థాలు : పెద్ద అరటిపండ్లు-ఆరు, పంచదార-రెండున్నర కప్పులు, నెయ్యి-ఒకటింపావు కప్పు, జీడిపప్పు-50గ్రా, మైదాపిండి-ఒకటింపావు కప్పు, వెనీలా ఎసెన్స్-ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం : ముందుగా అరటిపళ్లను ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అరటిపండు ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు చల్లారాక మెత్తగా చేయాలి. దీనికి మైదాపిండి చేర్చి బాగా కలిపి, మిగిలిన నెయ్యి, పంచదార చేర్చి పిండిని బాగా కలుపుతూ వేగించాలి. పంచదార పాకం బాగా వచ్చిన తర్వాత వేయించిన జీడిపప్పు, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. స్టీలు పళ్లెంలో బాగా నెయ్యి పూసి, హల్వా మాదిరిగా తయారైన స్వీట్‌ను పళ్లెంలో పోసి వెడల్పుగా చేయాలి. తర్వాత కావలసిన పరిమాణంలో ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







