ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు
- February 05, 2016
విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మోహరించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ సుమిత్రను మరో 5 యుద్ధ నౌకలు అనుసరిస్తున్నాయి. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్ లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







