పదిమంది హీరోయిన్లు ఒకే సినిమాలో!
- February 06, 2016
టాలీవుడ్ స్క్రీన్ మీద మరో ఆసక్తికరమైన సినిమా సందడి చేయనుంది. భారీ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బడా నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలను మాత్రమే మల్టీ స్టారర్ సినిమా అనేవారు. కానీ తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా మల్టీ స్టారర్ చేయవచ్చని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది పివిపి సంస్థ.అది కూడా ఒకరిద్దరు హీరోయిన్స్ తో కాదు, ఏకంగా పది మంది హీరోయిన్స్ తో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, అనుష్క లాంటి టాప్ హీరోయిన్స్ తో పాటు అనసూయ, రష్మీ లాంటి స్మాల్ స్క్రీన్ సెన్సేషన్లు కూడా నటించే అవకాశం ఉంది.గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలో ఒక్కపాటలో ఎనిమిది మంది హీరోయిన్లు సందడి చేయగా, ఇప్పుడు ఈ సినిమాలో పది మంది హీరోయిన్లు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.ఈ సినిమాకు సంబందించిన కథ కూడా రెడీగా ఉందంటున్న పివిపి సంస్థ, ఎవరు దర్శకత్వం వహిస్తారు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి అంశాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే సైజ్ జీరో, క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ప్రమోట్ చేస్తున్న పివిపి సంస్థ, ఒకే సినిమాలను పది మంది హీరోయిన్లు ఉంటే ఇంకే స్థాయిలో తెరకెక్కిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







