'ఆక్సిజన్' సినిమాసెకండ్ హీరోయిన్ ఇమ్మాన్యుయెల్
- February 06, 2016
హీరో గోపీచంద్ 'సౌఖ్యం' ఇచ్చిన షాక్ నుండి తేరుకుని మరో కొత్త సినిమాలో డిఫరెంట్ గా నటించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో తమిళ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ 'ఆక్సిజన్' అనే సరికొత్త స్క్రిప్టు తో గోపీ చంద్ తో ఒక సినిమాను తీస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభం అయిన ఈసినిమా పేరుకు తగ్గట్టే చాల డిఫరెంట్ గా ఉంటుంది అని టాక్. ఈసినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కథ రీత్యా ఈసినిమాకు మరో హీరోయిన్ ను కూడ ఎంపిక చేసారు. ఈ పాత్ర చాలా బోల్డ్ గా సెన్సేషనల్ గా ఉంటుందని టాక్. ఈ పాత్రకు మలయాళ అమ్మాయి అను ఇమ్మాన్యుయెల్ ను తీసుకున్నారు. ఈమె ఓ ఎన్నారై బేస్డ్ మోడల్.
ఐదేళ్ల కిందట జయరాం హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో స్కూల్ పాపగా నటించింది. ఇటీవలే విడుదలై హిట్ టాక్ తో నడుస్తున్న దర్శకుడు నివిన్ పౌలీ సినిమా 'యాక్షన్ హీరో బిజు' లో హీరోయిన్ అవతారమెత్తింది. గ్లామర్ ఎక్స్ పోజింగ్ లో ఈమె చాల బోల్డ్ గా నటిస్తుంది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ పాత్రకు ఈ కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసారు అని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈమె మళయాళ సినిమా రంగంలో నిర్మాతగా పేరున్న తనకచన్ ఇమాన్యుల్ కుమార్తె. 'లౌక్యం' ఇచ్చిన జోష్ తో అదే రెండక్షరాల సెంటిమెంట్ ను కొనసాగిస్తూ 'జిల్' 'సౌఖ్యం' సినిమాలను చేసినా కలిసిరాని నేపధ్యంలో కనీసం ఈ కొత్త హీరోయిన్ గ్లామర్ అయినా గోపీ చంద్ ను రక్షిస్తుందేమో చూడాలి. తమిళ దర్శకుల టేకింగ్ చాల వాస్తవానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈసినిమా గోపీచంద్ కు కోరుకున్న విజయాన్ని ఇచ్చే అవకాశం ఉంది..
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







