బహుమానం
- February 07, 2016
రాజకీయం ఎత్తు గడల్లో అధికార దాహం మైకంలో
రాజ్యాంగం ఆదమరచి నిద్రిస్తున్నప్పుడు
కశ్మీరo,కార్గిల్ మాతృమాత ఎదపై అందమైన
ఆభరణాలను కొల్లగొట్ట, మిత్రుడనుకున్నవాడే
శత్రువై దొంగ దెబ్బ తీయాలని వస్తే,
నీకు సరిపడా యంత్రాలను సమకూర్చలేని
అసమర్థ పాలకుల కోసం మా కోసం ...
దేశమాత పాలభాగం రక్షణలో,రక్తాన్ని చిలికి
వాస్తవాధీన రేఖను శాశ్వతం చేసావా
నేస్తం
నవమాసాలు మోసి పేగు పంచిన కన్నతల్లిని
మరచి,పాదాల పారాణి ఆరని నిను కట్టుకున్న
ఆ మహా తల్లిని విడచి,జన్మ నిచ్చిన నీ తండ్రికి
బహుమతిగా ..
నా కొడుకు వీర జవానని రొమ్ము విరుచుకొని
చెప్పుకొమ్మనే కదూ ?
నీవు జన్మించిన భూతల్లి ఋణం కోసం
మా సుఖం కోసం.. ప్రాణ త్యాగం చేసి
మా గుండెల్లో మండే ఆరని
దీపనివయ్యావులే నేస్తం!
--జయరెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







